Chandrababu: ఆ విషయాన్ని చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నాం: మంత్రి బొత్స

షార్ట్స్‌లో చూడండి
అక్రమ నిర్మాణం ప్రజావేదిక కూల్చివేత కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, సెక్రటేరియట్ కు వెళ్తూ ప్రజావేదిక కూల్చివేత పనులు ఎంత వరకూ వచ్చాయో చూద్దామని ఇటువైపు వచ్చినట్టు చెప్పారు.

అక్రమ నిర్మాణం కనుకనే ప్రజావేదికను తొలగిస్తున్నామని, అక్రమనిర్మాణాల విషయంలో చట్టం తన పని తాను చేసుకుబోతుందని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం చంద్రబాబు నివసిస్తున్న ఇల్లు కూడా అక్రమనిర్మాణమేనని, దీన్ని కూడా తొలగిస్తారా అన్న ప్రశ్నకు బొత్స సమాధానమిస్తూ, ఇక్కడే నివస్తారా? లేక ఖాళీ చేసి వెళతారా? అన్నది చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. చంద్రబాబు అనుభవజ్ఞుడని, ఆయనే నిర్ణయం తీసుకుంటారని, లేకపోతే, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Chandrababu
ex
cm
minister
botsa

More Telugu News