Cricket: వరుణుడి కారణంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ ఆలస్యం

  • బర్మింగ్ హామ్ లో వాన
  • చిత్తడిగా మారిన మైదానం
  • ఇంకా టాస్ వేయని వైనం
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో వరుణుడి ప్రభావం చాలా ఉంది. అనేక జట్ల సెమీస్ అవకాశాలు వాన కారణంగా తారుమారు అయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో, మరోసారి వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య బర్మింగ్ హామ్ లో జరగాల్సిన మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. మైదానం చిత్తడిగా ఉండడంతో ఇంకా టాస్ వేయలేదు. మ్యాచ్ నిర్ణీత సమయం కంటే గంటన్నర ఆలస్యంగా మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Cricket
Pakistan
New Zealand
World Cup

More Telugu News