Narendra Modi: అహంకారానికీ ఓ హద్దుంటుంది.... ఓటర్లను తక్కువచేసి మాట్లాడడం సరికాదు: మోదీ

  • తమ ఓటమికి ఓటర్లను నిందిస్తున్నారు
  • కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే దేశప్రజలు ఓడినట్టు కాదు
  • రాహుల్ ఓటమిపాలైనంత మాత్రాన ప్రజాస్వామ్యం ఓడినట్టు కాదు
ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో రాష్ట్రప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని పరోక్ష విమర్శలు సంధించారు. కొందరు విపక్షనేతలు ఇటీవల ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. తమ ఓటమికి ఓటర్లను నిందిస్తున్నారని, ఇది సరైన విధానం కాదని హితవు పలికారు. అహంకారానికీ ఓ హద్దుంటుందని, ఓటర్లను తక్కువచేసి మాట్లాడడం సరికాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే దేశప్రజలు ఓడిపోయినట్టుగా ప్రచారం జరుగుతోందని, రాహుల్ ఓడినంత మాత్రాన ప్రజాస్వామ్యం ఓడినట్టు కాదని మోదీ స్పష్టం చేశారు.
Narendra Modi
Rahul Gandhi

More Telugu News