ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం నమూనా విడుదల!

షార్ట్స్‌లో చూడండి
దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు ఈ ఏడాది కొత్తరూపంలో దర్శనం ఇవ్వనున్నాడు. ఈసారి గణేశుడు ‘ద్వాదశాదిత్య మహా గణపతిగా’గా భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు గణేశ్ ఉత్సవ కమిటీ తెలిపింది. ఈ విగ్రహ నమూనాను తాజాగా విడుదల చేసింది. 12 తలలు, 24 చేతులు, సప్త అశ్వాలతో కూడిన సూర్యరథంపై ఈసారి గణనాథుడు కొలువు దీరనున్నాడు. ఈ వినాయకుడి విగ్రహాన్ని 61 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేయనున్నారు.  ద్వాదశాదిత్య మహా గణపతికి కుడివైపున మహా విష్ణువు, ఏకాదశి దేవి, ఎడమవైపున బ్రహ్మవిష్ణుమహేశ్వర సమేత దుర్గాదేవి దర్శనం ఇవ్వనున్నారు.
Go Back to Shorts
Telangana
Hyderabad
khairadabad
ganesh
statue

More Telugu News