chandrababu: చంద్రబాబు నివాసం అక్రమమని తేలితే ఖాళీ చేస్తాం: గద్దె రామ్మోహన్

  • చంద్రబాబుపై కక్ష సాధింపుకు పాల్పడుతున్నారు
  • ఇతర భవనాలను వదిలేసి.. ప్రజావేదికనే ఎందుకు కూలుస్తున్నారు?
  • ప్రజలు అంతా గమనిస్తున్నారు
ప్రజావేదికను కూల్చివేస్తున్న నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా అక్రమమని... ఆయన కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ భవనం అక్రమమని తేలితే ఖాళీ చేస్తామని చెప్పారు. చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని... జగన్ ప్రభుత్వ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇతర భవనాలను వదిలేసి కేవలం ప్రజావేదికను మాత్రమే ఎందుకు కూలుస్తున్నారని ప్రశ్నించారు.
chandrababu
Gadde Rammohan
jagan
prajavedika
lingamaneni
Telugudesam
ysrcp

More Telugu News