mangalagiri: టీడీపీ నేత హత్య కేసు... పోలీసుల ఎదుట లొంగిపోయిన వైసీపీ నేత

  • మంగళగిరిలో టీడీపీ నేత ఉమా యాదవ్ దారుణ హత్య
  • అనుచరులతో కలసి లొంగిపోయిన వైసీపీ నేత శ్రీనివాసరావు యాదవ్
  • ఆధిపత్య పోరే హత్యకు కారణమని భావిస్తున్న పోలీసులు
గుంటూరు జిల్లా మంగళగిరిలో నిన్న రాత్రి టీడీపీ నేత ఉమా యాదవ్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో మద్దాయిలైన వైసీపీ నేత తోట శ్రీనివాసరావు యాదవ్ తో పాటు ఆయన అనుచరులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మంగళగిరిలోని నాలుగు రోడ్ల కూడలి జంక్షన్ లో జనం చూస్తుండగానే ఈ హత్య జరిగింది. ఈ హత్యకు వైసీపీ నేతే కారణమంటూ ఆయన ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించడంతో మంగళగిరిలో ఉద్రిక్తత నెలకొంది.

ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆధిపత్య పోరే హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పాతకక్షలు, రియలెస్టేట్ లావాదేవీలు, ఆధిపత్య పోరు వంటివి తెరపైకి వస్తున్నాయి. ఎన్నికలకు ముందు తన అనుచరులతో కలసి ఉమా యాదవ్ టీడీపీలో చేరారు. గతంలో జరిగిన బేతపూడి సర్పంచ్ బత్తుల నాగసాయి హత్య కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
mangalagiri
murder
Telugudesam
ysrcp

More Telugu News