Chandrababu: రెండేళ్లలో చంద్రబాబును జైలుకు పంపడం ఖాయం: బీజేపీ ఏపీ ఇన్ఛార్జి దేవధర్

  • కేంద్ర నిధులను పక్కదోవ పట్టించారు
  • అవినీతికి పాల్పడ్డారు
  • లోకేశ్ ను వారసుడిగా ప్రకటించడం దారుణం
టీడీపీ అధినేత చంద్రబాబును రెండేళ్లలో జైలుకు పంపడం ఖాయమని బీజేపీ ఏపీ ఇన్చార్జి సునీల్ దేవదర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులను చంద్రబాబు పక్కదోవ పట్టించి, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పేదల సంక్షేమం కోసం టీడీపీని స్థాపించి, 9 నెలలలోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. తన రాజకీయ వారసుడిగా లోకేశ్ ను చంద్రబాబు ప్రకటించడం దారుణమని అన్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టి... ఇచ్చిన వాగ్దానాన్ని ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకోవాలని కోరారు.
Chandrababu
nara lokesh
sunil deodar
bjp
jagan
ysrcp
Telugudesam

More Telugu News