ఇద్దరు రైతులను చంద్రబాబు, నారాయణ బెదిరించారు.. ‘ప్రజావేదిక’ స్థలాన్ని లాక్కున్నారు!: ఆళ్ల రామకృష్ణారెడ్డి
- దాసరి నాగయ్య, సాంబశివరావుపై తీవ్రంగా ఒత్తిడి చేశారు
- హైకోర్టు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు
- అమరావతిలో మీడియాతో మంగళగిరి ఎమ్మెల్యే
ఈ స్థలం ఇవ్వాలని అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ లు రైతులు దాసరి నాగయ్య, దాసరి సాంబశివరావులపై తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు.చివరికి బెదిరించి సదరు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. సీఆర్‌డీఏ పరిధిలోని అక్రమ నిర్మాణాలకు సంబంధించి 2015లో తహసీల్దార్, 2016లో హైకోర్టు నోటీసులు ఇచ్చాయన్నారు. అయినా వాటిని చంద్రబాబు పట్టించుకోలేదనీ, అక్రమ నిర్మాణాలు కొనసాగించారని చెప్పారు. ప్రజావేదిక కూల్చివేతపై రాద్ధాంతం అనవసరమని, చట్టాలకు ఎవరూ అతీతులు కాదని స్పష్టం చేశారు.