Andhra Pradesh: ‘పోలవరం’ మా నాన్న ఘనతే అని లోకేశ్ డప్పు కొట్టుకోవడం ఆపాలి!: విజయసాయిరెడ్డి
- జగన్ ఢిల్లీ టూర్ లో మోదీతో మాట్లాడారు
- అందుకే పోలవరంపై రూ.55,548 కోట్ల అంచనాలు సవరించారు
- టీడీపీ ప్రభుత్వం ఖర్చులకు లెక్కలు చూపలేదు
ఇటీవల ఢిల్లీలో పర్యటించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు పోలవరం అంచనాల ఆమోదం, నిధుల గురించి మాట్లాడారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. దీంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి రూ.55,548 కోట్ల సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదం తెలిపిందని చెప్పారు.
పోలవరం అంచనాలు పెరగడం తన తండ్రి ఘనతే అని ఎమ్మెల్సీ, టీడీపీ నేత నారా లోకేశ్ డప్పు కొట్టుకోవడం ఆపాలని సూచించారు. చేసిన ఖర్చులకు లెక్కలు చూపకుండా మొండికేసిన చరిత్ర మీది అని టీడీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.