Brian lara: నేను బాగానే ఉన్నాను.. ఆందోళన వద్దు: ఆడియో సందేశం విడుదల చేసిన లారా

  • గత కొన్ని రోజులుగా ముంబైలోనే లారా
  • స్టార్ స్పోర్ట్స్‌ చానల్‌లో కామెంటరీ బాధ్యతలు
  • చాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన లారా
తాను బాగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా తెలిపాడు. ముంబైలోని గ్లోబల్ ఆసుపత్రి నుంచి ఈ మేరకు ఆడియో సందేశం విడుదల చేశాడు. తాను కోలుకుంటున్నానని, ఆసుపత్రి బెడ్‌పై నుంచి ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ను తిలకిస్తున్నట్టు తెలిపాడు.

మంగళవారం ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన లారా కార్యక్రమం మధ్యలో చాతీ నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వెంటనే ఆయనను పరేల్ ప్రాంతంలోని గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. స్టార్ స్పోర్ట్స్ స్టూడియోలో కామెంటరీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న లారా గత కొన్ని రోజులుగా ముంబైలోనే ఉంటున్నాడు. భారత్-ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ అనంతరం కామెంటరీ బాధ్యతల నుంచి కొంత విరామం తీసుకున్న లారా రేపు భారత్-విండీస్ మ్యాచ్‌కు తిరిగి అందుబాటులోకి రానున్నాడు. 
Brian lara
West Indies
Hospital
Mumbai

More Telugu News