Bandla Ganesh: చెక్‌బౌన్స్ కేసులో ప్రొద్దుటూరు కోర్టుకు హాజరైన సినీ నిర్మాత బండ్ల గణేశ్

  • ప్రొద్దుటూరుకు చెందిన 60 మంది నుంచి రుణాలు
  • తిరిగి చెల్లించే క్రమంలో చెక్‌లు ఇచ్చిన గణేశ్
  • బౌన్స్ కావడంతో కోర్టును ఆశ్రయించిన రుణదాతలు
సినీ నిర్మాత బండ్ల గణేశ్ మంగళవారం కడప జిల్లాలోని ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు. పట్టణానికి చెందిన 60 మంది నుంచి గణేశ్ పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్నారు. వాటిని తిరిగి చెల్లించే క్రమంలో గణేశ్ ఇచ్చిన చెక్‌లు బౌన్స్ అయ్యాయి. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులకు సంబంధించి గణేశ్ పలుమార్లు ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు. తాజాగా, మంగళవారం కోర్టు వాయిదా ఉండడంతో ఆయన కోర్టుకు హాజరయ్యారు. కాగా, విచారణ అనంతరం కేసులను కోర్టు ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది.  
Bandla Ganesh
Kadapa District
proddutur
Tollywood

More Telugu News