Nirmala Sitharaman: ఏపీకి విభజన చట్టం కింద అదనంగా ఇచ్చిన నిధులు ఎంతంటే...!

  • గత మూడేళ్ల వివరాలు వెల్లడించిన నిర్మలా సీతారామన్
  • పోలవరం ప్రాజక్టుకు కూడా కేంద్ర నిధులు
  • రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన ఆర్థిక మంత్రి
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి విభజన చట్టం కింద ఇచ్చిన అదనపు నిధుల వివరాలను వెల్లడించారు. ఈ మేరకు రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. 2016-17లో రిసోర్స్ గ్యాప్ క్రింద రూ 1176.50 కోట్లు, రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి కొరకు రూ 350కోట్లు, రాజధాని అభివృద్ధి కొరకు రూ 450 కోట్లు   ఇచ్చిన కేంద్రం, పోలవరం ప్రాజక్టు కోసం కేంద్ర జలవనరుల శాఖ, నదీ అభివృద్ధి, గంగానదీ పునరుద్ధరణ విభాగం నుంచి  2016-17 లో రూ2514,70 కోట్లు, 2017-18 లో రూ 2000 కోట్లు,  2018-19 లో రూ1400 కోట్లు కేటాయించింది.  ఇక, లోన్ రీపేమెంట్, వడ్డీ చెల్లింపుల కొరకు మరో రూ 15.81కోట్లు కేటాయించినట్లు  గత మూడేళ్ల కాలవ్యవధికి సంబంధించి ఆర్థిక మంత్రి మంత్రి ఈ గణాంకాలను వెల్లడించారు.
 
Nirmala Sitharaman
Andhra Pradesh

More Telugu News