Puri Jagannadh: మైఖేల్ జాక్సన్ అభిమానులకు పూరీ జగన్నాథ్ బంపర్ ఆఫర్

  • ఇవాళ మైఖేల్ జాక్సన్ పదో వర్థంతి
  • ఈ సందర్భంగా పూరీ ట్వీట్
  • తన ట్వీట్ రీట్వీట్ చేసినవారిని ఫాలో అవుతానని చెప్పిన దర్శకుడు
పాప్ సంగీత రారాజు మైఖేల్ జాక్సన్ పదో వర్థంతి సందర్భంగా ఆయన అభిమానులు జ్ఞాపకాలతో తడిసిముద్దవుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మైఖేల్ జాక్సన్ అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. జాక్సన్ కు తాను కూడా వీరాభిమానినని తెలిపారు. ఇవాళ మైఖేల్ జాక్సన్ వర్థంతి సందర్భంగా ఆయన అభిమానులందరినీ ట్విట్టర్ లో ఫాలో అవుతానని ప్రకటించారు. అందుకు జాక్సన్ అభిమానులు చేయాల్సిందల్లా తన ట్వీట్ ను రీట్వీట్ చేయడమేనని వెల్లడించారు. తన పోస్టును రీట్వీట్ చేసినవారిని తప్పకుండా ఫాలో అవుతానని తన ట్వీట్ లో తెలిపారు.
Puri Jagannadh
Michael Jackson
Tweet
Fallow

More Telugu News