Andhra Pradesh: వైఎస్సార్ హయాంలో రైతు ఇంట్లో ప్రతిరోజూ సంక్రాంతి పండగే: వైసీపీ నేత నాగిరెడ్డి

  • వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించడం హర్షణీయం 
  • వైఎస్ హయాంలో సకాలంలో వర్షాలు కురిశాయి
  • రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా చూడాలన్నది వైఎస్ ఆకాంక్ష
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజు అయిన జూలై 8ని ఏపీ రైతు దినోత్సవంగా ప్రకటించడంపై వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవిఎస్ నాగిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో వ్యవసాయ రంగం ఆశాజనకంగా ఉండేదని అన్నారు. వైఎస్ పరిపాలనా కాలంలో రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిశాయని గుర్తుచేసుకున్నారు. వైఎస్ సీఎంగా ఉన్న కాలంలో రైతు ఇంట్లో ప్రతిరోజూ సంక్రాంతి పండగలా ఉండేదని అన్నారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా చూడాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాడు ఆకాంక్షించారని, ఆ ఆకాంక్షను వైఎస్ తనయుడు జగన్ నెరవేరుస్తారని నాగిరెడ్డి అన్నారు.
Andhra Pradesh
YSR
cm
Jagan
Nagireddy

More Telugu News