Chandrababu: ప్రజావేదికను కూల్చివేయాలనుకోవడం సరైన ఆలోచన కాదు: చంద్రబాబు

  • పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం
  • ప్రజావేదిక, టీడీపీ శ్రేణులపై దాడుల అంశం ప్రస్తావన
  • నాడు వైఎస్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి లేదు
ప్రజావేదికను కూల్చివేయాలనుకోవడం సరైన ఆలోచన కాదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు తమ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ప్రజావేదిక కూల్చివేతపై, టీడీపీ శ్రేణులపై జరిగిన దాడుల గురించి చంద్రబాబు వద్ద నేతలు ప్రస్తావించారు. ఈ సందర్భంగానే చంద్రబాబు పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.
Chandrababu
Telugudesam
YSRCP
cm
jagan
YSR

More Telugu News