డబ్బు, కారుతో ఉడాయించిన స్వామీజీ డ్రైవర్

షార్ట్స్‌లో చూడండి
శ్రీశైలంలోని విశ్వనాథ పీఠాధిపతి విశ్వనాథ్ స్వామీజీ డ్రైవర్ డబ్బు, కారుతో పరారయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్వామీజీ తన కారులో అవుటర్ రింగురోడ్డు మీదుగా మేడ్చల్‌ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కారు శామీర్‌పేట మండలంలోకి రాగానే మూత్ర విసర్జన కోసం స్వామీజీ కారును ఆపమన్నారు. ఇదే అదునుగా భావించిన డ్రైవర్ కిరణ్.. కారుతో పరారయ్యాడు. అందులో రూ.40 వేలు ఉన్నట్టు స్వామీజీ తెలిపారు.

స్వామీజీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న శామీర్‌పేట పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. కారుతో పరారైన డ్రైవర్ పటాన్‌చెరు టోల్‌గేట్ సమీపంలో వాహనాన్ని వదిలేసి అందులోని రూ.40 వేలు తీసుకుని పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వాధీనం చేసుకున్న కారును స్వామీజీకి అప్పగించారు. డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు.
Go Back to Shorts
Car
Vishwanth swamiji
Srisailam
Shamirpet
Hyderabad

More Telugu News