Sachin Tendulkar: నెట్ ప్రాక్టీసులో ఇంగ్లాండ్ ఆటగాళ్లతో కలిసిపోయిన సచిన్ తనయుడు

  • కెరీర్ లో ఎదుగుతున్న అర్జున్ టెండూల్కర్
  • ఇంగ్లాండ్ ఆటగాళ్లకు నెట్స్ లో బౌలింగ్
  • గతంలోనూ ఇంగ్లాండ్ శిబిరంలో కనిపించిన అర్జున్
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ క్రికెట్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. భారత అండర్-19 జట్టు సభ్యుడిగా అంతర్జాతీయ పర్యటనల ద్వారా అనుభవం సంపాదించుకుంటున్నాడు. అయితే అర్జున్ తన స్వస్థలం అయిన ముంబయి కంటే లండన్ లోనే ఎక్కువగా కనిపిస్తుంటాడు. లండన్ అర్జున్ అమ్మమ్మ గారిల్లు. సచిన్ అర్ధాంగి అంజలి తల్లి ఓ బ్రిటీష్ వనిత. ఈ చుట్టరికంతో అర్జున్ తరచుగా ఇంగ్లాండ్ లో పర్యటిస్తుంటాడు.

ఇప్పుడు వరల్డ్ కప్ లో ఏకంగా ఇంగ్లాండ్ ఆటగాళ్లతో కలిసిపోయి ప్రాక్టీసు చేయడం విశేషం. సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ ను ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్న ఇంగ్లాండ్ ఆటగాళ్లకు అర్జున్ నెట్స్ లో సహకరిస్తున్నాడు. ఎడమచేతివాటం అర్జున్ మంచి ఫాస్ట్ బౌలర్. ఇంగ్లాండ్ కోచ్ ఆధ్వర్యంలో సాగిన ప్రాక్టీసు సెషన్ లో అర్జున్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అర్జున్ ఇంగ్లాండ్ జట్టు నెట్స్ లో కనిపించడం ఇదే మొదటిసారి కాదు. 2015లో ఇంగ్లాండ్ జట్టు యాషెస్ సిరీస్ కోసం సన్నద్ధమవుతున్న వేళ కూడా అర్జున్ తన బౌలింగ్ తో ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ కు ప్రాక్టీసు అందించాడు.
Sachin Tendulkar
Arjun Tendulkar
Cricket
England

More Telugu News