Nellore District: బోరుబావిలో పడిన చిన్నారులను వెలికితీసిన అధికారులు... తీవ్రంగా గాయపడిన మూడేళ్ల బాలిక సుస్మిత మృతి

  • నెల్లూరు జిల్లాలో ఘటన
  • ఆడుకుంటూ వెళ్లి గుంతలో పడిన చిన్నారులు
  • హుటాహుటీన సహాయచర్యలు ప్రారంభించిన అధికారులు
బోరుబావిలో చిన్నారులు పడితే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందేనని కొన్ని సంఘటనలు నిరూపించిన వేళ, నెల్లూరు జిల్లాలో ఇద్దరు చిన్నారులు బోరుబావిలో పడడం అందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేసింది. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పెదపాలెంలో ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయారు. దాంతో అధికారులు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకుని సహాయచర్యలు ప్రారంభించారు. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్వయంగా సహాయ చర్యలను పర్యవేక్షించారు. జేసీబీతో బోరుగుంతకు సమాంతరంగా మట్టి తవ్వించి చిన్నారులను బయటికి తీశారు. అయితే, మూడేళ్ల సుస్మిత అనే బాలిక తీవ్ర గాయాలపాలవడంతో మృతి చెందడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
Nellore District

More Telugu News