Jharkhand: ఝార్ఖండ్‌లో ఘోరం.. గ్రామస్తుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

  • ఒక రోజంతా యువకుడిపై గ్రామస్తుల దాడి
  • తీవ్రంగా గాయపడిన యువకుడు
  • శనివారం నాడు చికిత్స పొందుతూ మృతి
ఝార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. టూ వీలర్ దొంగిలించాడని గ్రామం మొత్తం కలిసి ఓ యువకుడిపై దాడి చేసింది. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగు చూసింది. టూవీలర్ దొంగిలించాడని ఆరోపిస్తూ ఓ యువకుడ్ని పట్టుకుని గ్రామస్తులంతా చితకబాదారు. ఇలా ఒక రోజంతా ఆ యువకుడిపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకునేసరికే యువకుడు స్పృహ తప్పి పడిపోయాడు. అత్యవసర చికిత్స నిమిత్తం యువకుడిని ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. యువకుడు కోలుకుంటాడనుకుంటున్న సమయంలో శనివారం నాడు హఠాత్తుగా మృతి చెందాడు. దీంతో యువకుడి ఇంట విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Jharkhand
Two Wheeler
Villagers
Police
Hospital

More Telugu News