Andhra Pradesh: పోలీసులు నన్ను అడుగడుగునా ఆపి తనిఖీలు చేశారు.. ఇది మంచి పద్ధతి కాదు!: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

  • చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతల భేటీ
  • పలుమార్లు తనిఖీలు నిర్వహించిన పోలీస్ అధికారులు
  • తీవ్రంగా మండిపడ్డ టీడీపీ నేత
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంట్లో ఆ పార్టీ నేతలు ఈరోజు అత్యవసరంగా సమావేశం అయ్యారు. ప్రజావేదిక కూల్చివేత, టీడీపీ రాజ్యసభ సభ్యులు పార్టీ ఫిరాయించడం సహా పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీకి పార్టీ ముఖ్యనేతలు, మాజీ మంత్రులు హాజరయ్యారు. కాగా, ఈరోజు ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకుంటున్న టీడీపీ నేతలకు చేదు అనుభవం ఎదురయింది.

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కారును పోలీస్ అధికారులు పలుమార్లు ఆపి తనిఖీలు నిర్వహించారు. దీంతో అసహనానికి లోనైన ఆయన మీడియా ఎదుట తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ‘చంద్రబాబు నివాసానికి మేం వెళుతున్నాం. వెళుతుంటే అడుగడుగునా ఆపడం, చెక్ చేయడం చాలా బాధ అనిపించింది. ఇది మంచి పద్ధతి కాదని పోలీస్ వారికి కూడా మేం సూచిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
Kollu Ravindra
checkings
Police
angry

More Telugu News