komatireddy rajagopalreddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి జంపేనా?: ఢిల్లీ వెళ్లడంతో ఊహాగానాలు

  • ఈనెల 28వ తేదీన కమదళంలోకి అంటూ వార్తలు
  • తనతోపాటు మరికొందరిని తీసుకువెళ్లే యోచన
  • జాబితాతో రాజధానికి బయలుదేరి వెళ్లిన ఎమ్మెల్యే
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కమలదళంలో చేరిపోవడం ఖాయమైనట్టేనా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. బీజేపీ అగ్రనాయకులను కలిసేందుకు ఆయన దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లడం, తనతోపాటు పార్టీలో చేరబోయే వారి జాబితా కూడా తీసుకువెళ్లారన్న ఊహాగానాల నేపథ్యంలో బీజేపీలో ఆయన చేరిక దాదాపు ఖరారయ్యిందని చెప్పుకుంటున్నారు. ఈనెల 28వ తేదీన ఆయన కాషాయం కండువా కప్పుకుంటారన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
komatireddy rajagopalreddy
Congress
BJP
New Delhi

More Telugu News