అన్నా.. ఇకపై నాకు శాలువాలు, బొకేలు తీసుకురావద్దు.. ఆ ఒక్క పని చేయండి!: మంత్రి అనిల్ కుమార్
- బొకేలకు బదులుగా స్టేషనరీ వస్తువులు తీసుకోండి
- అవి స్కూలు పిల్లలకు చేరేలా చూడండి
- ట్విట్టర్ లో కోరిన ఏపీ జలవనరుల మంత్రి
ఈరోజు ట్విట్టర్ లో మంత్రి అనిల్ స్పందిస్తూ..‘నన్ను కలవడానికి ఎంతో దూరం నుండి వస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు అన్న. కాకపోతే ఇక నుండి మీరు శాలువా, బోకేలకు బదులుగా, ఏమన్నా పుస్తకాలు, పెన్, పెన్సిల్, అలా పిల్లలకు ఉపయోగ పడే స్టేషనరీ వస్తువులు వాళ్ళకి చేరేదట్టు చూడండి అన్న. నాకు చాలా ఆనందం కలిగిస్తుంది’ అని ట్వీట్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సైతం ఈ తరహాలోనే పార్టీ శ్రేణులకు గతంలో సూచించిన సంగతి తెలిసిందే.