Bonda Uma: అప్పటి మంత్రులు ప్రతి చిన్న విషయానికి భజన చేసి చంద్రబాబుకు నిజాలు తెలియకుండా చేశారు: బోండా ఉమ

షార్ట్స్‌లో చూడండి
ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడంతో తెలుగుదేశం పార్టీ లోపాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి, ముఖ్యనేతల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో విజయవాడ టీడీపీ నేత బోండా ఉమ కాస్తంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అప్పటి మంత్రుల్లో కొందరు ఓ భజన బృందంలా తయారయ్యారని ఆరోపించారు. ప్రతి చిన్న విషయానికీ భజన చేసి చంద్రబాబుకు నిజాలు తెలియకుండా చేశారని మండిపడ్డారు.

క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అధినేత దృష్టికి తీసుకెళ్లలేదని, కార్యకర్తలను చంద్రబాబుకు దూరం చేశారని దుయ్యబట్టారు. దానికితోడు, ప్రశాంత్ కిశోర్ టీమ్ రూపొందించిన 'ఒక్క చాన్స్' నినాదం కూడా టీడీపీకి వ్యతిరేకంగా మారిందని బొండా ఉమ చెప్పుకొచ్చారు. టీడీపీ సర్కారు పెన్షన్లు పెంపుదల చేసినా 'ఒక్క చాన్స్' నినాదం ముందు అది పనిచేయలేదని తెలిపారు.
Go Back to Shorts
Bonda Uma
Telugudesam
Chandrababu

More Telugu News