Budha venkanna: అక్రమాస్తులు కూడబెట్టడంలో ఏ1,ఏ2గా మీ రికార్డులు ఎవరూ అందుకోలేనివి: విజయసాయిపై బుద్దా వెంకన్న ధ్వజం
- దోపిడీ ముఠాలకు నాయకత్వం నీది
- ప్రజా వేదిక అక్రమ నిర్మాణమంటావు
- అక్రమాస్తుల కేసులో తమరు ఏ2నే కదా
రాజ్యసభకు వెళ్లినా, అక్రమాస్తుల కేసులో తమరు ఏ2నే కదా అని టీడీపీ నేత బుద్దా వెంకన్న వైసీపీ నేత విజయసాయిరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న విరుచుకు పడ్డారు. దొంగలకే దొంగ అని, దోపిడీ ముఠాలకు నాయకత్వం నీదంటూ విమర్శించారు. ప్రజా వేదిక అక్రమ నిర్మాణమంటావని, కలెక్టర్ల సదస్సుకు వాడితే తప్పేంటంటావని ప్రశ్నించారు.
అక్రమాలు చేయాలన్నా అక్రమాస్తులు కూడబెట్టాలన్నా ఏ1, ఏ2గా మీ రికార్డులు ఎవరూ అందుకోలేరంటూ విరుచుకు పడ్డారు. నీతి నిజాయితీల గురించి ఏ1, ఏ2లు చెబుతుంటే వీరప్పన్ మొక్కల పెంపకానికి పిలిచినట్టుందంటూ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. జలయజ్ఞంలో లక్ష కోట్లు మేసి అవినీతి సామ్రాట్టులుగా ప్రతి శుక్రవారం కోర్టుకు వెళుతున్నారని దుయ్యబట్టారు.