JDS: జేడీఎస్‌తో పొత్తు కారణంగా చాలా నష్టపోయాం: వీరప్ప మొయిలీ

  • మా పార్టీ కార్యకర్తలే వ్యతిరేకించారు
  • పొత్తు లేకుంటే 16 స్థానాల్లో గెలిచేవాళ్లం
  • జేడీఎస్‌ను అతిగా నమ్మి నష్టపోయాం
జేడీఎస్‌తో పొత్తు కారణంగా తాము చాలా నష్ట పోయామని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జేడీఎస్‌తో పొత్తు మాత్రమే కాకుండా స్వయంగా తమ పార్టీ కార్యకర్తలే తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన విషయం తనకు బాగా తెలుసన్నారు.

జేడీఎస్‌తో పొత్తు లేకుండా దాదాపు 16 లోక్‌సభ స్థానాల్లో గెలిచి ఉండే వారమన్నారు. తాము జేడీఎస్‌ను అతిగా నమ్మి నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. చిక్‌బల్లాపూర్‌లో పొత్తు లేకుంటే తాను గెలిచే వాడినన్నారు. ఒక్క చిక్‌బల్లాపూర్‌లోనే కాకుండా చాలా నియోజకవర్గాల్లో గెలిచే వారమని వీర్ప మొయిలీ వ్యాఖ్యానించారు.
JDS
Veerappa Moili
Congress
Loksabha
Chikballapur

More Telugu News