Hyderabad: జంట నగరాల్లో వర్షం.. రోడ్లపై భారీగా వర్షపు నీరు!

  • జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం
  • పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం
  • నెమ్మదిగా ముందుకు కదులుతున్న వాహనాలు
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని పలు చోట్ల ఈరోజు మధ్యాహ్నం వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, కూకట్ పల్లి, ఎస్ ఆర్ నగర్, రాజీవ్ నగర్, సికింద్రాబాద్, కోఠి, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, మలక్ పేట, ఎల్బీనగర్, సంతోష్ నగర్, మెహిదీపట్నం, మాసబ్ ట్యాంక్, గుడిమల్కాపూర్, అల్వాల్, బొల్లారం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆయా ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. వాహనాలు చాలా నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.
Hyderabad
secunderabad
rain
jublijills

More Telugu News