Andhra Pradesh: ఏపీలో గ్రామ వాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్లు విడుదల

  • నెల్లూరు, ప్రకాశం మినహా నియామక ప్రకటనలు
  • రేపటి నుంచి జులై 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
  • ఎంపికైన వారికి శిక్షణ.. ఆగస్టు 15 నుంచి విధులు
ఏపీలో గ్రామ వాలంటీర్ల నియామకం కోసం జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ మేరకు 11 జిల్లాల కలెక్టర్లు ప్రకటనలు జారీ చేశారు. నెల్లూరు, ప్రకాశం మినహా అన్ని జిల్లాల్లో నియామక ప్రకటనలు విడుదలయ్యాయి. 11,077 పంచాయతీల్లో 1,56,437 వాలంటీర్లను నియమించనున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున నియమిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,072 పంచాయతీల్లో 21,600 వాలంటీర్లను నియమించనున్నారు. రేపటి నుంచి జులై 5 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు gramavolunteer.ap.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వాలంటీర్లకు శిక్షణానంతరం ఆగస్టు 15 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది.
Andhra Pradesh
cm
jagan
volunteers

More Telugu News