electrical employees: విద్యుత్‌ చౌర్యం చేస్తున్నారని ప్రశ్నించినందుకు దాడి...గాయపడిన ఉద్యోగులు

  • కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండం సోమూరు గ్రామంలో ఘటన
  • చౌర్యానికి పాల్పడుతున్న ఇళ్లను గుర్తించి వీడియో తీస్తున్న సిబ్బంది
  • దాడికి పాల్పడిన ఓ కుటుంబం
విద్యుత్‌ చౌర్యానికి పాల్పడడమేకాక దాన్ని గుర్తించి ప్రశ్నించిన విద్యుత్‌ సిబ్బందిపై ఓ కుటుంబం దాడికి పాల్పడిన ఘటన ఇది. కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం సోమూరు గ్రామంలో ఈరోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు...గ్రామంలోని కొన్ని ఇళ్లలో విద్యుత్‌ చౌర్యం జరుగుతోందని గుర్తించిన విద్యుత్‌ సిబ్బంది ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో పరిశీలనకు వెళ్లారు. కొన్ని ఇళ్లలో వారు విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్నారని గుర్తించి వారిని ప్రశ్నించారు. అనంతరం ఆ ఇళ్లను సెల్‌ఫోన్‌లో వీడియో, పొటోలు తీస్తుండగా ఓ కుటుంబానికి చెందిన సభ్యులంతా ఒక్కసారిగా విద్యుత్‌ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులు గుద్దడంతో పాటు కర్రలతో దాడిచేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో దుక్కల్‌ సబ్‌ ఇంజనీర్‌ నవీన్‌కుమార్‌ తలకు తీవ్రగాయాలయ్యాయి. మరో ఐదుగురు సిబ్బందికి స్వ్గల్ప గాయాలయ్యాయి. దాడి నుంచి తప్పించుకున్న సిబ్బంది మజ్నూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
electrical employees
raided by villagers
Kamareddy District
6 injured

More Telugu News