sports: ఏపీ స్పోర్ట్స్‌ అంబాసిడర్‌గా పి.వి.సింధు...జగన్‌ని కోరుతానన్న మంత్రి ముత్తంశెట్టి

  • ఒలింపిక్‌ డే రన్‌లో పాల్గొన్న మంత్రి
  • ఈ సందర్భంగా ఈ విషయం వెల్లడి
  • ఇందిరాగాంధీ స్టేడియం నుంచి డీవీ మానర్‌ హోటల్‌ వరకు రన్‌
ఆంధ్రప్రదేశ్‌ క్రీడా విభాగం బ్రాండ్‌ అంబాసిడర్‌గా బ్యాడ్మింటన్‌ స్టార్‌ పి.వి.సింధును నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయం తనకు ఉందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. విజవాడలో ఈరోజు ఉదయం ఏపీ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఒలింపిక్‌ రన్‌ జరిగింది. మహాత్మాగాంధీ రోడ్డులో  ఇందిరాగాంధీ స్టేడియం నుంచి డీవీ మానర్‌ హోటల్‌ వరకు జరిగిన రన్‌లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారని, ఉదయాన్నే ఆయన వ్యాయామం చేశాకే తన దినచర్య ప్రారంభిస్తారని తెలిపారు. గడచిన నాలుగేళ్లలో ఏపీ ఒలింపిక్‌ సంఘంలో ఎన్నో వివాదాలు నడిచాయని, దీనికి ఫుల్‌స్టాప్‌ పెట్టాన్న ఉద్దేశంతోనే అధికారంలోకి రాగానే ఒలింపిక్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలను తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని, పాఠశాల స్థాయి నుంచే క్రీడను ప్రోత్సహించాన్నది తన అభిప్రాయమని చెప్పారు.
sports
muttamsetti srinivasarao
olympic run

More Telugu News