Virat Kohli: షమీ, బుమ్రా ఆకలిగొన్న పులులు... అందుకే విజయం: విరాట్ కోహ్లీ!

  • అవకాశం లభిస్తే ఎవరకూ వదలరు
  • పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించలేదు
  • బుమ్రానే మా అస్తమనుకున్నాం: కోహ్లీ
భారత క్రికెట్ ప్లేయర్లు తమకు అందివచ్చిన అవకాశాన్ని ఏ మాత్రమూ వదులుకునేందుకు సిద్ధంగా లేరని, జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలు ఆకలిగొన్న పులుల వంటివారని, అందువల్లే తక్కువ స్కోర్ చేసినా ఆఫ్గనిస్థాన్ పై విజయం సాధించగలిగామని అన్నాడు. నిన్న మ్యాచ్ తరువాత మీడియాతో మాట్లాడిన కోహ్లీ, జట్టులోని అందరూ చాన్స్ ల కోసం ఎదురు చూస్తున్నారని అన్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం డ్రస్సింగ్ రూమ్ నిర్ణయమని, అయితే, పిచ్ అంత ప్రతికూలంగా ఉంటుందని అనుకోలేదని, 270 పరుగుల వరకూ చేస్తామని భావించామని చెప్పాడు. పిచ్ సహకరించని కారణంగానే క్రాస్ షాట్స్ ఆడకూడదని గ్రహించానని, అటువంటి పిచ్ పై ముగ్గురు మణికట్టు స్పిన్నర్లున్న ఆఫ్గన్ జట్టును ఎదుర్కోవడం కష్టమైన పనేనని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. బుమ్రానే తమ అస్త్రమని భావించామని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచించామని చెప్పుకొచ్చాడు. కాగా, నిన్నటి మ్యాచ్ లో దాదాపు గెలిచినంత పని చేసిన ఆఫ్గన్ ను బౌలర్లు కట్టడి చేసిన సంగతి తెలిసిందే.
Virat Kohli
Shami
Bumrah
India
Cricket
Afghanistan

More Telugu News