sarada petam: శారదా పీఠానికి హైదరాబాద్‌లో రెండెకరాల స్థలం...ఎకరా రూపాయికే

  • రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో స్థలం
  • జీఓ జారీ చేసిన కేసీఆర్‌ ప్రభుత్వం
  • ఆలయం, వేద మఠం, సంస్కృత విద్యా సంస్థల నిర్మాణం
శారదా పీఠానికి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో రెండెకరాల స్థలం కేటాయించింది. పీఠం ఆధ్వర్యంలో ఆలయం, వేదభాష గోష్ఠి మఠం, సంస్కృత విద్యా సంస్థల ఏర్పాటు, విద్యార్థులకు వసతి గృహం, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం కోసం భూమి కేటాయించాంటూ పీఠం చేసిన విజ్ఞప్తికి కేసీఆర్‌ ప్రభుత్వం స్పందించింది. వాస్తవానికి పీఠం ధర్మాధికారి జి.కామేశ్వరశర్మ 2015, 2018లో భూమి కోసం దరఖాస్తు చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో మరోసారి ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తుకు స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రతిపాదన అందింది. దీనిపై స్పందించి సీఎంఓ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి విషయం తీసుకువెళ్లడంతో ఆయన ఒకే చెప్పారు. దీంతో అధికారులు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట గ్రామ సర్వే నంబరు 240లో భూమిని కేటాయిస్తూ శనివారం జీఓ ఎంఎస్‌ నంబరు 71ని జారీ చేసింది.
sarada petam
hydearabad
two acers land

More Telugu News