Nagababu: పవన్ కల్యాణ్ విషయంలో జనాలకు ఓ డౌటుంది: నాగబాబు

  • ఓటేసినా ఉపయోగం ఉండదేమోనని భావించారు
  • చంద్రబాబును ఓడించాలంటే జగన్ ఒక్కడే కనిపించాడు
  • 2024లో పవన్ ను గెలిపించుకుంటామని చెప్పారు
జనసేన పార్టీకి ఎన్నికల్లో నిరాశ కలిగించే ఫలితాలు రావడంపై మెగాబ్రదర్ నాగబాబు స్పందించారు. తాజాగా, తన యూట్యూబ్ చానల్ లో మాట్లాడుతూ, ఏపీలో చాలామంది ప్రజలు పవన్ కల్యాణ్ పై నమ్మకం చూపించలేదని అన్నారు.

"చంద్రబాబుపైనా, ప్రభుత్వంపైనా విపరీతమైన కోపంతో ఉన్న ప్రజలు పవన్ కల్యాణ్ కు ఓటేస్తే అది వృథా అవుతుందేమో అన్న సందేహానికి లోనయ్యారు. ఇలాంటి సమయంలో చంద్రబాబును గద్దె దింపాలంటే వారికి జగన్ ఒక్కడే కనిపించాడు. నేను చాలామంది ప్రజలతో మాట్లాడాను. వారందరిదీ ఒకటేమాట. ఈసారికి జగన్ కు ఓటేస్తాం, 2024లో మాత్రం పవన్ కల్యాణ్ నే గెలిపించుకుంటాం అని చెప్పారు.

 జనసేన ఓడిపోయిందంటే అందులో ఓటర్ల తప్పేంలేదు. వారు చెప్పినట్టే చేశారు. జగన్ విషయానికొస్తే సానుభూతి అంశం బాగా పనిచేసింది. జగన్ కు ఒక్క చాన్సిద్దాం, 2024లో పవన్ ను గెలిపిద్దాం అని ప్రజలు భావించారు" అంటూ నాగబాబు తన యూట్యూబ్ వీడియోలో పేర్కొన్నారు.
Nagababu
Pawan Kalyan
Jagan
Jana Sena

More Telugu News