Bihar: మ్యాచ్ కోసం పెళ్లి వాయిదా.. ప్రపంచకప్‌లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్న వీరాభిమాని!

  • టీం ఇండియా మ్యాచ్ ఎక్కడ ఉందంటే అక్కడ ప్రత్యక్షం
  • క్రికెట్ కోసం వందల కిలోమీటర్లు సైకిల్‌పై వెళతాడు
  • చందాలు అడుక్కుని మరీ టికెట్ కొనుక్కుంటాడు
  • మ్యాచ్‌లన్నింటినీ చూసే అవకాశం కల్పించిన బీసీసీఐ
బీహార్‌కు చెందిన సుధీర్ చౌదరి అనే వ్యక్తికి క్రికెట్ మ్యాచ్‌లంటే మామూలు ఇష్టం కాదు. టీం ఇండియా మ్యాచ్ ఎక్కడ ఉందంటే అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా వందల కిలో మీటర్లు సైకిల్‌పై ప్రయాణించి మరీ మ్యాచ్‌కు వెళతాడు. ఇక స్టేడియం లోపలికి ఎంట్రీ కోసం చందాలు అడుక్కుని మరీ టికెట్ కొనుక్కుంటాడు. సుధీర్ అభిమానం గురించి తెలుసుకున్న బీసీసీఐ, ఇండియా మ్యాచ్‌లన్నింటినీ చూసేందుకు అతనికి అవకాశం కల్పిస్తోంది.

అయితే ఇప్పుడు అతను మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. కారణం వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూడటం కుదరదని తన పెళ్లిని వాయిదా వేసుకోవడమే. అతనికి సచిన్ టెండూల్కర్ అంటే ప్రాణం. మ్యాచ్‌కు హాజరవుతున్నాడంటేనే ఒంటికి, మొహానికి రంగు వేసుకుని మరీ రెడీ అవుతాడు. ప్రపంచక‌ప్‌ కి కూడా అలాగే హాజరవుతున్నాడు. దీంతో సుధీర్ మ్యాచ్‌కి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు.
Bihar
Sudheer Chowdary
Cricket
World Cup
Sachin Tendulkar
Team India

More Telugu News