తెలంగాణ పోలీసులు బీజేపీ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీని ప్రయోగిస్తున్నారు!: బీజేపీ ఎంపీ బండి సంజయ్
- ఎన్నికల తర్వాత మాపై దాడులు పెరిగాయి
- పోలీసులు టీఆర్ఎస్ నేతలకు వత్తాసు పలుకుతున్నారు
- కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన లోక్ సభ సభ్యుడు
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు థర్డ్ డిగ్రీని ప్రయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదనీ, జాతీయ బీసీ కమిషన్ తో పాటు కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.