Cricket: ఆఫ్ఘనిస్థాన్ పై టాస్ గెలిచిన టీమిండియా

  • బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ
  • గాయంతో బాధపడుతున్న భువీకి విశ్రాంతి
  • మహ్మద్ షమీకి అవకాశం
సౌతాంప్టన్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్ తో జరిగే వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసే జట్లకు పిచ్ అనుకూలిస్తున్న నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఆలోచనకు తావులేకుండా బ్యాటింగ్ తీసుకున్నాడు. కాగా, టీమిండియాలో ఓ మార్పు చోటుచేసుకుంది. గాయంతో బాధపడుతున్న బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్థానంలో మహ్మద్ షమి బరిలో దిగుతున్నాడు. కాగా, భారత జట్టు ఈ టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడి 3 విజయాలతో కొనసాగుతుండగా, ఆఫ్ఘనిస్థాన్ జట్టు 5 మ్యాచ్ లు ఆడి అన్నింట్లోనూ ఓటమిపాలైంది.
Cricket
India
Afghanistan
World Cup

More Telugu News