Andhra Pradesh: గుంటూరు జిల్లా పరిషత్ ‘ఎక్స్ అఫీషియో’ సభ్యుడిగా నారా లోకేశ్!

  • నమోదు చేసుకున్న టీడీపీ నేత
  • మంగళగిరి అసెంబ్లీ, మున్సిపాలిటీ నుంచి నమోదు
  • రేపు సమావేశానికి హాజరుకానున్న లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ గుంటూరు జెడ్పీ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదయ్యారు. నారా లోకేశ్ రెండేళ్ల క్రితం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీలు ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకోవాలి. ఏ నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్సీ తమ పేరును నమోదు చేసుకుంటారో, అక్కడ ఆయనకు ప్రోటోకాల్ వర్తింపజేస్తారు.

ఈ నేపథ్యంలో నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గం, మున్సిపాలిటీలో తన పేరును ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నారు. దీంతో ఇకపై లోకేశ్ గుంటూరు జిల్లా పరిషత్ లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కొనసాగుతారు. కాగా, ఈ నెల 23న అంటే రేపు జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశానికి రావాల్సిందిగా నారా లోకేశ్ కు అధికారులు ఆహ్వానం పంపినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.
Andhra Pradesh
Guntur District
zp ex officio member
Nara Lokesh
Telugudesam

More Telugu News