ram: 'ఇస్మార్ట్ శంకర్' కొత్త విడుదల తేదీ

  • పూరి నుంచి 'ఇస్మార్ట్ శంకర్'
  • వరల్డ్ క్రికెట్ కారణంగా విడుదల తేదీ మార్పు
  • జూలై 18కి విడుదల వాయిదా
రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా పనులు ముగింపు దశకి చేరుకున్నాయి. రామ్ సరసన నిధి అగర్వాల్ - నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాను జూలై 12వ తేదీన విడుదల చేయాలనుకున్నారు.

అయితే ఇప్పుడు అందరి దృష్టి ప్రపంచ కప్ కోసం క్రికెట్ పరంగా జరుగుతోన్న పోరుపైనే వుంది. అందువలన ఆ ప్రభావం 'ఇస్మార్ట్ శంకర్' వసూళ్లపై పడొచ్చనే ఉద్దేశంతో విడుదల తేదీని జూలై 18వ తేదీకి మార్చారు. ఈ విషయాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా తెలియజేసింది. ఈ సినిమాలో రామ్ ను పూర్తి మాస్ లుక్ తో పూరి చూపిస్తున్నాడు. మాస్ ఆడియన్స్ ను అలరించడానికి అందుకు సంబంధించిన అన్ని అంశాలు ఉండేలా చూసుకున్నాడు. ఆయన ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి మరి.
ram
nidhi agarwal
nabha natesh

More Telugu News