Tollywood: హీరో నితిన్ కు ట్రాఫిక్ కష్టాలు.. మెట్రోను ఆశ్రయించిన నటుడు!

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ టాలీవుడ్ నటుడు నితిన్ కు ట్రాఫిక్ కష్టాలు ఎదురయ్యాయి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి నితిన్ కారు హైదరాబాద్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. దీంతో నితిన్ మెట్రో రైలును ఆశ్రయించాడు. ఈ విషయమై నితిన్ ఫేస్ బుక్ లో స్పందిస్తూ..‘రోడ్లపై చాలా ట్రాఫిక్ ఉంది. దీంతో ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి మెట్రోను ఆశ్రయించా. ఈ ప్రయాణం అద్భుతంగా సాగింది’ అని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా నితిన్ తో సెల్ఫీల కోసం ప్రయాణికులు ఎగబడ్డారు. నితిన్, రష్మిక జంటగా ప్రస్తుతం ‘భీష్మ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు.
Go Back to Shorts
Tollywood
nitin
Hyderabad
traffic
metro
Facebook

More Telugu News