గంటాను కూడా బీజేపీలోకి పంపుతారు: చంద్రబాబుపై అవంతి సంచలన కామెంట్

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని చంద్రబాబు ఎదుర్కోలేకపోతున్నారని అన్నారు. అందుకే టీడీపీ నేతలను బీజేపీలోకి పంపుతున్నారని ఆరోపించారు.

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన గంటా శ్రీనివాసరావును కూడా త్వరలోనే బీజేపీలోకి పంపుతారని, ఈ విషయంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అవంతి అన్నారు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నేతలు బీజేపీలో చేరుతున్నారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు తమ వద్దకే వస్తారన్న అమిత్ షా వ్యాఖ్యలను ఈ సందర్భంగా అవంతి గుర్తు చేశారు. అమిత్ షా వ్యాఖ్యలు ఇప్పుడు నిజం అవుతున్నాయని, బీజేపీలోకి టీడీపీ నేతలు క్యూ కడుతున్నారని మంత్రి పేర్కొన్నారు.
Go Back to Shorts
Chandrababu
Ganta Srinivasa Rao
Avanthi srinivas
Andhra Pradesh
BJP

More Telugu News