Jagan: మా మీద కోపంతో పోలవరం పనులు ఆపొద్దు: జగన్‌కు దేవినేని హితవు

  • పోలవరం పనులపై ఆడిట్ చేస్తామన్న జగన్ వ్యాఖ్యలు సరికాదు
  • నిబంధనల ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణం
  • ఇంజినీరింగ్ నిపుణుల కమిటీ సూచన మేరకే కాపర్ డ్యాం నిర్మాణం
తమ మీద కోపాన్ని పోలవరం ప్రాజెక్టుపై చూపించొద్దని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి హితవు పలికారు. నిబంధనల మేరకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

 పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎటువంటి అవకతవకలు జరగలేదన్నారు. ఇంజినీరింగ్ నిపుణుల కమిటీ సూచన మేరకే కాపర్ డ్యాంను నిర్మించినట్టు తెలిపారు. పోలవరం పనులపై ఆడిట్ చేస్తామన్న జగన్ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. అప్పర్ కాపర్ డ్యాం పనులు 60 శాతం పూర్తయినట్టు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు చెప్పారు. తమ మీద కోపాన్ని ప్రాజెక్టుపై ప్రదర్శించొద్దని, ప్రాజెక్టు నిర్మాణం విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని దేవినేని సూచించారు.
Jagan
Devineni Uma
Polavaram project

More Telugu News