Shabbir Ali: నేడు టీడీపీకి.. రేపు టీఆర్ఎస్‌కు ఇదే గతి!: కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ

  • బీజేపీ తీర్థం పుచ్చుకున్న నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు
  • ప్రాంతీయ పార్టీలను బీజేపీ ఆక్రమిస్తోందన్న షబ్బీర్ 
  • మోదీపై ఓ కన్నేసి ఉంచాలంటూ కేసీఆర్‌కు సూచన
ఆంధ్రప్రదేశ్‌లో నేడు టీడీపీకి పట్టిన గతే రేపు తెలంగాణలో టీఆర్ఎస్‌కు పడుతుందని తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్‌రావులు బీజేపీలో చేరడాన్ని ఉద్దేశించి ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

దేశంలోని ప్రాంతీయ పార్టీలను బీజేపీ క్రమంగా ఆక్రమిస్తోందని షబ్బీర్ అలీ ఆరోపించారు. మహారాష్ట్రలో శివసేన, బీహార్‌లో జేడీఎస్, ఏపీలో టీడీపీకి పట్టిన గతే తెలంగాణలో టీఆర్ఎస్‌కూ పడుతుందని హెచ్చరించారు. ప్రధాని మోదీ, బీజేపీలను ఓ కంటకనిపెడుతూ ఉండాలని కేసీఆర్‌కు షబ్బీర్ సూచించారు.  
Shabbir Ali
Congress
BJP
Telugudesam
TRS

More Telugu News