తేజస్వీయాదవ్ ఆచూకీ చెబితే రూ.5100 నజరానా.. కలకలం రేపుతున్న పోస్టర్
- మెదడువాపు వ్యాధితో 112 మంది చిన్నారుల మృత్యువాత
- పట్టించుకోని ప్రధాన ప్రతిపక్షం
- తేజస్వీ ఎక్కడున్నారో పార్టీ నేతలకే తెలియని వైనం
తేజస్వీ యాదవ్ ఎక్కడున్నారో నిజానికి ఆ పార్టీ నేతలకు కూడా తెలియడం లేదు. ప్రపంచకప్ మ్యాచ్లను వీక్షించేందుకు ఆయన లండన్ వెళ్లారని కొందరంటే, వ్యక్తిగత పనిమీద ఆస్ట్రేలియా వెళ్లారని మరికొందరు అంటున్నారు. దీంతో ఆయన ఎక్కడికి వెళ్లారన్న దానిపై పార్టీ నేతల్లోనే స్పష్టత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత తీరుపై ప్రజలు తమ వ్యతిరేకతను ఇలా వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆచూకీ చెప్పిన వారికి రూ.5100 ఇస్తామంటూ ముజఫర్నగర్లో పోస్టర్లు అతికించారు.