Ramanaidu: సీబీఐ దాడులకు భయపడే వారు పార్టీ మారారు: టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు

  • వేటు వేసే వరకూ ఊరుకునేది లేదు
  • సమాచారం ఇవ్వకుండా స్వాధీనం చేసుకున్నారు
  • చంద్రబాబు భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం
సీబీఐ దాడులకు భయపడే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ మారారని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు ఆరోపించారు. ప్రజావేదికను ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేడు ప్రజా వేదిక ఎదుట ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ, ప్రజావేదికను తమకు కేటాయించాలని సీఎం జగన్‌కు చంద్రబాబే స్వయంగా లేఖ రాశారన్నారు.

అయినా కూడా బాబు విదేశాల్లో ఉన్న సమయంలో దానిని స్వాధీనం చేసుకున్నారని వాపోయారు. దీనిని తామంతా ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ, కనీస సమాచారం ఇవ్వకుండా ప్రజావేదికను స్వాధీనం చేసుకున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇతర కార్యక్రమాలు చేపడితే చంద్రబాబు భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. పార్టీ మారిన నలుగురు ఎంపీలపై వేటు వేసే వరకూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. 
Ramanaidu
Chandrababu
Jagan
Prjavedika
Information

More Telugu News