Amit Shah: అమిత్ షా యోగా కార్యక్రమంలో ప్రజల చేతివాటం!

  • యోగా మ్యాట్లు తీసుకెళ్లిన జనాలు
  • నిర్వాహకుల కంటపడకుండా తప్పించుకునేందుకు పాట్లు
  • ఒకరి నుంచి మరొకరు మ్యాట్లు లాక్కునేందుకు ప్రయత్నం
ఎన్డీయే సర్కారు చాన్నాళ్లుగా యోగా డేని ఎంతో ఘనంగా నిర్వహిస్తోంది. ఐక్యరాజ్యసమితి వంటి ప్రపంచవేదికలోనూ ఆసనాలు వేయిస్తూ యోగాకు విశేష ప్రాచుర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా యోగా డే వేడుకలు నిర్వహించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హర్యానాలోని రోహతక్ లో యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రారంభంలో ప్రజలందరూ చిత్తశుద్ధితో యోగాసనాలు వేసినా, చివరికొచ్చేసరికి అల్పబుద్ధి ప్రదర్శించారు. ఆసనాలు వేసేందుకు ఇచ్చిన మ్యాట్లను మడిచి ఇళ్లకు తీసుకెళ్లేందుకు పోటీలు పడ్డారు. కొందరిని నిర్వాహకులు అడ్డగించినా, మరికొందరు అందినకాడికి చాపలను మడిచి నిర్వాహకుల కంటబడకుండా బయటికి తరలించారు. అంతేకాదు, ఒకరు సేకరించిన మ్యాట్లను మరొకరు లాక్కోవడం, కలబడడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరినీ ఆకర్షిస్తోంది.
Amit Shah
Yoga
Mats

More Telugu News