Andhra Pradesh: ఢిల్లీలో గరికపాటి రామ్మోహన్ ఇంటికి వెళ్లిన తెలంగాణ బీజేపీ నేతలు!

  • టీడీపీ నుంచి బీజేపీలో చేరిన గరికపాటి
  • అనంతరం కొద్దిసేపటికే అస్వస్థత
  • ఇంటికెళ్లి పరామర్శించిన లక్ష్మణ్, రాజాసింగ్, చింతల
టీడీపీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్ ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు బీపీ పడిపోవడంతో హుటాహుటిన ఢిల్లీలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆరోగ్యం కుదుటపడటంతో ఇంటికి తరలించారు. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, రామచంద్రరావు, ఇంద్రసేనా రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు.

అనంతరం వీరు నేరుగా గరికపాటి రామ్మోహన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిపోయారు. తెలంగాణ బీజేపీ నేతలు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశముందని బీజేపీ వర్గాలు తెలిపాయి.
Andhra Pradesh
Telugudesam
BJP
garikapati rammohan
ill

More Telugu News