china: చైనాలో ఇంటి ఓనర్ తో వాగ్వాదం.. రూ.15 లక్షల అద్దెను చిల్లరగా ఇచ్చి పగ తీర్చుకున్న వ్యాపారి!

  • షాన్ డాంగ్ ప్రావిన్సులోని జినాన్ నగరంలో ఘటన
  • 20 ప్లాస్టిక్ బకెట్లలో చిల్లరను పంపిన వ్యాపారి
  • 26 మంది 4 గంటల పాటు కష్టపడి చిల్లర లెక్కింపు
  తమ విరోధులపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటారు. చైనాలోని షాన్ డాంగ్ ప్రావిన్సు జినాన్ లో ఓ వ్యాపారవేత్త అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. అయితే ఇంటి ఓనర్ కు, సదరు వ్యాపారవేత్తకు ఏవో మాట పట్టింపులు వచ్చాయి. దీంతో ఆగ్రహానికి లోనైన సదరు వ్యాపారవేత్త అద్దె చెల్లించే విషయంలో ఓనర్ పై పగ తీర్చుకున్నాడు.

20 ప్లాస్టిక్ బకెట్లలో రూ.15.17 లక్షల చిల్లరను సర్ది ఓనర్ కు పంపించాడు. దీంతో ఇంటి యజమాని ఒక్కసారిగా షాక్ కు లోనయ్యాడు. చివరికి 26 మంది ఉద్యోగులు రంగంలోకి దిగి 4 గంటల పాటు కష్టపడి ఆ చిల్లరను లెక్కించారు.  
china
sdhandong
jinan
rent
coins
revengge

More Telugu News