Andhra Pradesh: పవన్ కల్యాణ్ పై పరోక్ష విమర్శలు గుప్పించిన జనసేన నేత ఆకుల సత్యనారాయణ!

  • కుల సమీకరణాలతో రాజకీయాలు చేస్తే భంగపాటే
  • పవన్ ఐదేళ్లు రాజకీయాల్లో ఉంటారో, లేదో?
  • ప్రజల్లోకి తన ఆలోచనల్ని తీసుకెళ్లడంలో పవన్ విఫలమయ్యారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సొంత పార్టీ నేత ఆకుల సత్యనారాయణ పరోక్ష విమర్శలు గుప్పించారు. కుల సమీకరణాలతో రాజకీయాలు చేయాలనుకుంటే భంగపాటు తప్పదని వ్యాఖ్యానించారు.తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆకుల సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

రాబోయే ఐదేళ్లు పవన్ ప్రజల్లో ఉంటారో, లేదో కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. తన ఆలోచనలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జనసేన అధినేత విఫలం అయ్యారని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఆకుల సత్యనారాయణ తన సొంత పార్టీ బీజేపీలోకి చేరుతారని వార్తలు చక్కర్లు కొట్టడంపై ఆయన స్పందించారు. తనకు ఇప్పుడు పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
Andhra Pradesh
Jana Sena
Pawan Kalyan
akula satyanarayana
criticise

More Telugu News