sujana chowdary: అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయిన సుజనా చౌదరిని బీజేపీ ఎలా తీసుకుంది?: వర్ల రామయ్య

  • పనికిమాలిన ఎంపీలు పోయినంత మాత్రాన నష్టమేమీ లేదు
  • సుజనాకు ఏం క్లీన్ చిట్ ఉందని తీసుకున్నారు?
  • వాళ్లు ప్రజల్లో నుంచి వచ్చినవారు కాదు
పనికిమాలిన నలుగురు ఎంపీలు పోయినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని ఆ పార్టీ నేత వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ చేస్తారనే భయంతో సుజనా చౌదరి అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారని... అలాంటి వ్యక్తిని బీజేపీలోకి ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. సుజనాకు ఏం క్లీన్ చిట్ ఉందని తీసుకున్నారో అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారు. బీజేపీలో చేరిన నలుగురు ఎంపీలు ప్రజల్లో నుంచి వచ్చినవారు కాదని, చంద్రబాబు దయాదాక్షిణ్యాలపై పదవులు పొందారని అన్నారు. స్వప్రయోజనాల కోసం పార్టీ మారారని విమర్శించారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటిలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
sujana chowdary
varla
Chandrababu
Telugudesam
bjp
mp

More Telugu News