Fire Accident: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం...మెట్రో రైలు సేవలకు అంతరాయం

  • కలిందికుంజ్‌ పర్నీచర్‌ మార్కెట్లో ప్రమాదం
  • సమీపంలోనే మెట్రో రైల్వే స్టేషన్‌
  • మంటల్ని అదుపులోకి తెచ్చిన ఫైర్‌ ఇంజిన్లు
ఢిల్లీలోని కలిందికుంజ్‌ ఫర్నీచర్‌ మార్కెట్లో ఈరోజు ఉదయం 5.55 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీ స్థాయిలో మంటలు ఎగసి పడడంతో అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. కాగా, అగ్నికీలలు భారీ స్థాయిలో ఎగసి పడుతుండడం, ఘటనా స్థలికి సమీపంలోనే కలిందికుంజ్‌ మెట్రో రైల్వేస్టేషన్‌ ఉండడంతో మెజెంటా లైన్‌లోని మెట్రోరైల్‌ సర్వీస్‌కు అంతరాయం ఏర్పడింది. అధికారులు ముందుజాగ్రత్త చర్యగా  షాహీన్‌బాగ్‌, బొటానికల్‌ గార్డెన్‌ స్టేషన్ల మధ్య మెట్రో సర్వీసులు నిలిపివేశారు. 17 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ అతుల్‌గార్గ్‌ తెలిపారు.
Fire Accident
New Delhi
kalindikunju market

More Telugu News