rahul gandhi: రాష్ట్రపతి ప్రసంగిస్తున్నప్పుడు మొబైల్ లో రాహుల్ ఏం చూస్తున్నారంటే..!

  • పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి
  • మొబైల్ ఫోన్ చూస్తూ ఉండిపోయిన రాహుల్
  • అర్థం కాని హిందీ పదాలను మొబైల్ లో ట్రాన్స్ లేషన్ చేసుకున్నారన్న కాంగ్రెస్
నిన్న పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని ముందు వరుసలో కూర్చున్న ప్రధాన మోదీ, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, ఇతర సభ్యులు శ్రద్ధగా విన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాత్రం తన మొబైల్ లో చూస్తూ ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ కిసాన్ మోర్చా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా... అది వైరల్ గా మారింది.

దీనిపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ స్పందిస్తూ, రాహుల్ ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో అర్థంకాని హిందీ పదాలను తన మొబైల్ ద్వారా ట్రాన్స్ లేషన్ చేసుకుని, అర్థం చేసుకున్నారని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని రాహుల్ వింటూనే ఉన్నారని తెలిపారు. 
rahul gandhi
president
phone
parliament

More Telugu News